కీలక పదవిలో మరో ప్రవాస భారతీయురాలు

-

మనదేశానికి చెందిన ఎందరో ప్రవాస భారతీయులు పలు దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉన్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా లో అయితే చెప్పనక్కర్లేదు. అక్కడి ప్రభుత్వ యంత్రాంగం లో అనేక మంది ప్రవాసులు పనిచేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో వ్యక్తి కూడా వచ్చి చేరింది.
అమెరికాకు చెందిన ప్రవాస భారతీయురాలు షేఫాలి ఆర్. దుగ్గల్ (50) ను నెదర్లాండ్స్ అమెరికా రాయబారి గా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. ఈ కీలకమైన పదవి భాద్యతలు షేఫాలి వచ్చే నెలలో చేపట్టబోతున్నారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జన్మించిన షేఫాలి , చిన్నతనంలోనే తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్, మియామి విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు.
షేఫాలికి మానవతా హక్కుల ఉద్యమకారిణి గా మంచి పేరుంది. పలు మానవ హక్కుల సంస్థల్లో కీలకమైన పదవులు నిర్వహించారు. అనేక పౌర పూరస్కారాలు అందుకున్నారు.
షేఫాలి 2008లో డెమొక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాల్లో కి ప్రవేశించి బరాక్ ఒబామా కు మద్దతు గా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం లో జాతీయ మహిళా కమిషన్ సహా ఛైర్మన్ గా ఉన్నారు. ఇంకా పార్టీ పరంగా డెమోక్రటిక్ పార్టీ ఆర్థిక వనరులు కమిటీ అధ్యక్షురాలిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news