కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని పేర్కొంది.
నిజానికి వీటి సేవలను ఈ నెల 12 వరకు రద్దు చేస్తున్నట్టు జూన్ 25న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. రేపటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,34,945 కరోనా యాక్టివ్ కేసులుండగా, 15,35,743 డిశ్చార్జి కేసులున్నాయి. వైరస్ ప్రభావంతో 43,386 మంది చనిపోయారు.