వెనక్కి తగ్గిన సచిన్ పైలట్..అందుకేనా ?

-

సీఎం అశోక్ గెహ్లాట్ తో తనకున్న విభేదాలను పరిష్కరిస్తామని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చారని ఇక తన సమస్య తీరినట్టేనని పార్టీ బలోపేతం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజస్థాన్ రెబల్ లీడర్ సచిన్ పైలట్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈయన సడన్ గా ఇలా వెనక్కు తగ్గడానికి అనేక కారణాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. గెలిచే అవకాశం లేని పోరాటం చేయడం వృధా అని సచిన్ కి అర్ధమయిందని చెబుతున్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కుప్పకూలుతుందో, లేదో స్పష్టత లేకపోవడంతో, సచిన్ పైలట్ కొన్నాళ్ళగా టెన్షన్ తో ఉన్నారు.

అదీ కాక పైలట్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు, చివరి నిముషంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ క్యాంపులో చేరిపోవడంతో ఆయన ఇక వర్కౌట్ కాదని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అదీ కాక రాజస్తాన్ బీజేపీలో శక్తివంతమైన నేతగా ఉన్న వసుంధర రాజే మద్దతు దారులైన ఎమ్మెల్యేలు బలపరీక్షలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే మొదటికే మోసం వస్తుందని కూడా ఆయన భావించినట్టు చెబుతున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో, సచిన్ పైలట్ ను తిరిగి ఏదో రకంగా నచ్చజెప్పి, బుజ్జగించి పార్టీ లోనే కొనసాగేలా గాంధీ ఫ్యామిలీ తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేసిందే కానీ సచిన్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు, చర్యలు తీసుకోలేదు సో ఇంత ఫేవర్ గా ఉన్న పార్టీని వదులుకోవడం ఇష్టం లేక యూటర్న్ తీసుకున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news