అమెరికాలో బిక్కు బిక్కు మంటూ భారతీయులు…!

-

అమెరికాలో ఇప్పుడు భారతీయుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారు అయింది. బయటకు వెళ్ళడానికి లేదు ఇంట్లో ఉంటే తిండి లేదు. లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఇప్పుడు అమెరికాలో నరకం చూస్తున్నారు. ప్రతీ రోజు కూడా వాళ్లకు దిన దిన గండం లానే ఉంది. అక్కడ నా అనే వాడు లేడు. ఆదుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఇక్కడ పొలాలు అమ్మి అప్పులు చేసి అమెరికా వెళ్ళారు.

పార్ట్ టైం ఉద్యోగాలతో అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ అన్ని వ్యాపారాలు దాదాపుగా మూత పడిన సంగతి తెలిసిందే. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడి నుంచి తల్లి తండ్రులు వారికి డబ్బులను పంపలేని పరిస్థితిలో ఉన్నారు. రూపాయి లేక ఆదుకునే వాళ్ళు లేక ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్ధం కావడం లేదు. ఇంటికి కూడా రాలేకపోతున్నారు.

ఎవరికి చెప్పినా పరిస్థితి మెరుగు పడేలా లేదు. అక్కడ తిండి లేక కొంత మంది బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తినే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పట్లో అమెరికాలో సాధారణ పరిస్థితులు వచ్చేలా లేవు. అమెరికా నుంచి విమానాలు కూడా మన దేశానికి వచ్చే పరిస్థితి లేదు. దీనితో అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా బ్రతకాలో అర్ధం కాక తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news