కోవిడ్ తగ్గుముఖం పడుతున్నా కే‌సి‌ఆర్ రిస్క్ తీసుకోదలచుకోవడం లేదు ?

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభంలో కోవిడ్ 19 తెగ రెచ్చిపోయింది. దక్షిణ భారతదేశంలో కేరళ తర్వాత అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. ఉన్న కొద్దీ ఎక్కువ అవటం తర్వాత ఢిల్లీ మాత ప్రార్థనలకు వెళ్లిన వారికి కూడా పాజిటివ్ ఫలితాలు రావడంతో ఒక్కసారిగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయాయి. అయితే లాక్ డౌన్ పటిష్టంగా అమలు పరచడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవటంతో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.Telangana CM KCR's 'save our women' comment triggers row, KTR ...చాలా వరకు గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. ఇటువంటి టైం లో లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం తీసేసినా గాని తెలంగాణలో కొనసాగించాలని అనుకుంటున్నారట. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ముఖ చిత్రాన్నే మార్చేసింది నిజాముద్దీన్‌ తబ్లిగ్‌ మర్కజ్‌. అయితే ఈ ప్రార్థనా సమావేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువగా హైదరాబాద్ వాసులు ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగించాలని కే‌సి‌ఆర్ అనుకుంటున్నారట.

 

సో మొత్తం మీద కేసీఆర్  నిజాముద్దీన్‌ తబ్లిగ్‌ మర్కజ్‌ దెబ్బకి కేసులు తగ్గుముఖం పట్టిన గాని రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఆర్థికంగా ప్రస్తుతం రాష్ట్రం ఎంత నష్టపోయిన గని… హైదరాబాద్ వంటి నగరాలలో సాధన సమావేశాలకు వెళ్లిన వారు ఎక్కువగా ఉండటంతో కే‌సి‌ఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించాలని అనుకుంటున్నారట. 

Read more RELATED
Recommended to you

Latest news