సముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి భారత్ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. హిందూ మహా సముద్రంలో ఆధిపత్యం చెలాయించడానికి ఎప్పటినుంచో చైనా యత్నిస్తోంది.ఈ క్రమంలోనే సముద్రంలో అత్యాధునిక యుద్ధ నౌకలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేవీ, వాయుసేన, ఆర్మీని బలోపేతం చేస్తున్నది.
తాజాగా మూడు యుద్ధనౌకలను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. దీంతో భారత నేవీ అమ్ముల పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు చేరాయి.INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్ షీర్ యుద్ధనౌకలను బుధవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో మరో కీలక ముందడుగు పడినట్లు రక్షణ రంగం అధికారులు తెలిపారు.