పెళ్లికి మందు శృంగారం..ప్రభుత్వం సంచలన నిర్ణయం

-

శృంగారం అనేది ఇదివరకు నాలుగు గోడల మధ్య ఉండేది. కానీ కాలంతో పాటు శృంగారం విషయం కూడా బహిర్గతం అవుతూ వచ్చింది. ఇది వరకు శృంగారానికి సంబంధించిన విషయాలను ఏవైనా మాట్లాడాలంటే చాలా సిగ్గుగా అనిపించేది. ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ బయటకి వ్యక్తపరిచేవారు కాదు. అయితే, ఈ శృంగారం విషయంలో ఇండోనేషియా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

పెళ్లికి ముందు శృంగారాన్ని నియంత్రించేందుకు జైలు శిక్షను ఖరారు చేసింది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది పాటు జైలు శిక్ష విధించడం ఖాయమని తెలిపింది. ఇందుకు సంబంధించిన క్రిమినల్ కోడ్ ను త్వరలోనే తీసుకురానున్నట్లు స్థానిక మీడియా ద్వారా తెలిపింది. భర్త లేకపోతే భార్య కానీ వారితో ఎవరైనా శృంగారం చేసినట్లయితే గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష తప్పదని ఇండోనేషియా పేర్కొంది. ఇందుకు ఆర్టికల్ 413ను ఎంచుకుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ క్రిమినల్ కోడ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news