“ఏమాయ చేసావే” తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది అక్కినేని కోడలు సమంత. టాలీవుడ్‌లో హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. కొత్త కొత్త అంశాలతో సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకుల మదిలో వేసుకుంది. దక్షిణాది స్టార్ హీరోల సరసన నటించిన సామ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది.
అయితే తన మొదటి సినిమా హీరో అక్కినేని అందగాడు చైతన్య తో కొన్ని రోజులు ప్రేమ నడిపి …పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017 లో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. పెళ్లి తర్వాత తన అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో సమంత పక్కన ”అక్కినేని” అనే పదాన్ని చేర్చుకుని తెలుగింటి కోడలుగా ప్రశంసలు అందుకుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సోషల్ మీడియా అకౌంట్లలోనూ సమంత అక్కినేని గానే ఉండేది. అయితే.. తాజాగా ఏం అయిందో తేలీదు కానీ.. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ల నుంచి అక్కినేని అనే పదాన్ని తొలిగించింది సమంత. అక్కినేని పదాన్ని తొలగించి.. ”ఎస్” అనే పేరుతో డిస్ ప్లే పేరును మార్చేసింది. దీంతో ఉన్నట్లుండి సమంత పేరు మార్చడంపై అందరిలోనూ కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్ప్పుడు సమంత అకౌంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.