తాలిబన్ల మరో దుశ‍్చర్య : ఫోటో రిలీజ్

అఫ్ఘానిస్తాన్‌ దేశంలో రాజ్యంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా దౌర్జన్యంగా తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు స్వాధనం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి చాలా దుర్మార్గాలకు ఒడి గడుతున్నారు తాలిబన్లు. తాజాగా అఫ్ఘానిస్తాన్‌ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మరో దుశ్చర్య కు పాల్పడ్డారు.

ప్రముఖ మత గురువు మౌల్వీ మొహమ్మద్‌ సర్దార్‌ జాద్రాన్‌ ను తమ స్వాధీనం లోకి తీసుకున్నారు. ఈ మేరకు వారు ఓ ఫోటో ను రిలీజ్‌ చేశారు తాలిబన్లు. ఆఫ్ఘాన్‌ నేషనల్ కౌన్సిల్‌ ఆఫ్‌ రిలీజియస్‌ స్కాలర్స్‌ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్‌ సర్దార్‌ జాద్రాన్‌ ను అరెస్ట్‌ చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు. మొహమ్మద్‌ మౌల్వీ కళ్లకు గంతలు కట్టి ఉన్న సర్దార్‌ జద్రాన్‌ ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. కాగా.. ఇప్పటి కే జానపద గాయకుడిని తాలిబన్లు హత్య చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. గతంలో తొలి మహిళా గవర్నర్‌ లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.