చాలా మంది ఇళ్లల్లో ధన నష్టం కలగడం.. ఆర్థిక ఇబ్బందులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్లు లక్ష్మీకటాక్షం కలగాలంటే ఈ వాస్తు చిట్కాలను అనుసరిస్తే మంచిది. పండితులు అటువంటి వాళ్ల కోసం ఎన్నో అద్భుతమైన వాస్తు చిట్కాలని మనతో పంచుకోవడం జరిగింది. ఈ చిట్కాలను కనుక మీరు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు వంటివి పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న ఈ చిట్కాల గురించి మనం ఇప్పుడే చూసేద్దాం.
ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడతారో వాళ్ళు ఈ విధంగా పాటిస్తే ఎంతో మేలు కలుగుతుంది. దీనితో మీ పరిస్థితి బాగుంటుంది. ఆనందంగా కూడా ఉండొచ్చు. మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొద్దిగా పసుపుని తీసుకుని మీరు డబ్బులు దాచుకునే చోటు పెట్టండి. అంటే బీరువాలో కానీ లేదు అంటే డబ్బులు దాచుకునే పెట్టెలో కానీ పెట్టండి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అలాగే బీరువాలో కుబేర యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. దీనితో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా వారానికి ఒకసారి ఇంట్లో కర్పూరం వెలిగించాలి. కర్పూర పొగవల్ల ఆ వాస్తు దోషాలు తొలగిపోతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ఇలా ఈ విధంగా పాటిస్తే తప్పకుండా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. మీ బాధలు కూడా మాయమైపోతాయి.