Telangana : రాష్ట్రంలో తగ్గుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసులు

-

తెలంగాణలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. కాకపోతే కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పింది. డిసెంబరులో ఈ కేసులు గరిష్ఠంగా ఉండగా.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో తగ్గుముఖం పట్టాయని విశ్లేషించింది.

దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఆ శాఖ కార్యదర్శి రిజ్వి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిషనర్‌ శ్వేతా మహంతి, డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నమోదైన కేసులతో పాటు ఏయే వయసుల వారిపై ఇన్‌ఫ్ల్లూయెంజా ప్రభావం ఎక్కువగా ఉందనే అంశాలను విశ్లేషించారు.

సాధారణ శ్వాస సంబంధిత సమస్యలు అత్యధికంగా డిసెంబరులో 14,196 కేసులు రాగా జనవరిలో 13,441, ఫిబ్రవరిలో 11,624 కేసులు వచ్చినట్లు గుర్తించారు. మార్చిలో ఇప్పటివరకూ సుమారు రెండు వేల కేసులు నమోదైనట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news