ఖదిజ్ఞాసి ఆత్మ సమర్పణ దీక్ష తీసుకున్న వారికి గురువారం దీక్ష విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీక్ష తీసుకున్న వారికి జై భారత్ బ్యాడ్జీ, పతాకాన్ని సమర్పించారు. అలాగే ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని చెబుతూ.. జై భారత్ బ్యాగులు అందజేశారు. దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ సాధారణ జీవన విధానాన్ని గడపకుండా ఖదిజ్ఞాసి జీవితాన్ని అలవర్చుకోవాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని జై భారత్ కార్యదర్శి రాజు అన్నారు.
ఈ సందర్భంగా గొడుకొండ్ల గ్రామానికి చెందిన నాలుగవ వార్డు మెంబర్ పార్వతమ్మ మాట్లాడుతూ.. ఖదిజ్ఞాసి దీక్ష ఎంతో ప్రత్యేకమైనదన్నారు. జై భారత్ సంస్థ సామాజిక విలువలు, సామాజిక మార్పు కోసం ప్రతిక్షణం పోరాడుతుందన్నారు. ప్రజల కష్టాలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తోటి మహిళలకు బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జై భారత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రాజు, ఖదిజ్ఞాసి లావణ్య, వార్డు మెంబర్ పార్వతమ్మ, ఆశావర్కర్ రాణి తదితరులు పాల్గొన్నారు.