ప్రతి ఒక్కరి లైఫ్ లో సక్సెస్, ఫెయిల్యూర్ రెండు ఉంటాయి అనుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ గెలవలేరు. కానీ నిజానికి గెలవాలంటే మనం ఎంతో ప్రయత్నం చేయాలి. కానీ గట్టిగా అనుకుంటే గెలవడం సాధ్యం. అలానే గెలవాలంటే గెలుపుకి తగ్గ కృషి చేయాలి ఎప్పటినుంచో ఏదైనా సాధించాలని సాధించలేకపోయే వాళ్ళందరూ ఈయనని స్ఫూర్తిగా తీసుకోవాలి. రైతులకి కూడా స్ఫూర్తే.
ఐటి ఉద్యోగి అయినప్పటికీ కూడా బ్లాక్ రైస్ సాగు చేసి మంచిగా లాభాలని పొందుతున్నాడు. ఇతని పేరు శశికాంత్. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. కరోనా సమయంలో బ్లాక్ రైస్ పండించడం పై ఆసక్తి కలగడంతో బ్లాక్ రైస్ ని పండించాలని అనుకున్నాడు.బ్లాక్ రైస్ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది పైక రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. బ్లాక్ రైస్ విత్తనాలను వరంగల్ నుండి తీసుకువచ్చి తనకి ఉన్నఐదు ఎకరాల పొలంలో బ్లాక్ రైస్ ని సాగు చేయడం మొదలుపెట్టాడు.
పైగా పురుగుల మందు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఒక ఎకరంలో బ్లాక్ రైస్ ని పండిస్తున్నాడు. పశువుల వ్యర్ధాలని ఎరువుగా ఉపయోగించి ఈ పంటని పండిస్తున్నాడు. దీని వలన కేవలం ఆదాయం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా బాగుంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యవసాయం మీద ఇష్టం ఉండడంతో ఇలా పండించాడు. నిజానికి శశికిరణ్ ఇతర రైతులకు కూడా ఆదర్శం.