లోకేష్ ‘యాత్ర’: పెద్ద చిక్కు ఉందే..!

-

రాజకీయాల్లో పాదయాత్ర అనేది నాయకుల ఇమేజ్ పెంచేది అని చెప్పొచ్చు..అలాగే ప్రజలని నాయకులకు దగ్గర చేసే ఘట్టం. ఈ ఘట్టంలో దాదాపు అందరూ సక్సెస్ అవుతారనే చెప్పొచ్చు. అలా అని అందరూ సక్సెస్ అవ్వాలనే రూల్ కూడా లేదు. అయితే పాదయాత్ర అంటే మొదట గుర్తొచ్చేది వైఎస్సార్..2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితిలో ఉంది..అలాంటి పార్టీని తన పాదయాత్రతో ఒక్కసారిగా పైకి లేపారు. ప్రజల్లోకి వెళ్ళి తన ఇమేజ్ పెంచుకోవడమే కాదు..2004లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారు.

ఇక తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేశారు..2014కు ముందు టీడీపీ చాలా క్లిష్ట పరిస్తితుల్లో ఉంది..ఆఖరికి డిపాజిట్లు కూడా దక్కని పరిస్తితి. అలాంటి పరిస్తితి నుంచి పాదయాత్ర చేసి..టీడీపీని 2014లో అధికారంలోకి తీసుకొచ్చారు.  అప్పుడే బాబుకు పోటీగా షర్మిల వైసీపీ కోసం పాదయాత్ర చేశారు…జగన్ జైల్లో ఉండటంతో షర్మిల పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చారు. కానీ అప్పుడు వైసీపీ సక్సెస్ కాలేదు.

2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర చేశారు..దాని ద్వారా జనాలకు దగ్గరయ్యి..2019లో భారీ విజయంతో అధికారం దక్కించుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర ట్రెండింగ్ మొదలైంది. ఇటు తెలంగాణలో విడతల వారీగా బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. కొన్ని రోజుల్లో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇటు ఏపీ విషయానికొస్తే నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది గాని..డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. కానీ తాజాగా డేట్ ఫిక్స్ అయింది. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత, మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రధానంగా యువతని ఎట్రాక్ట్ చేసేలా లోకేష్ యాత్ర సాగనుంది.

అయితే పాదయాత్ర ద్వారా టీడీపీతో పాటు లోకేష్‌కు ప్లస్ కానుంది. ఇప్పుడుప్పుడే బలపడుతున్న టీడీపీకి లోకేష్ పాదయాత్ర ప్లస్ అవుతుంది. అలాగే నాయకుడుగా ఎదుగుతున్న లోకేష్‌కు కూడా ప్లస్సే. ప్రజల్లో లోకేష్ ఇమేజ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది…అదేంటంటే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి..టీడీపీ అధికారంలోకి లోకేష్ సీఎం అవుతారని వైసీపీ ప్రచారం చేసే ఛాన్స్ ఉంది.

అలాగే లోకేష్‌ని సీఎం చేయడం కోసం పవన్ కష్టపడుతున్నారని జనసేన శ్రేణులని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్రచారం జనంలోకి వెళితే..చంద్రబాబు ఉండగా లోకేష్ సీఎం అవ్వడం ఏంటి అని జనం ఆలోచిస్తే టీడీపీకి మైనస్. అటు జనసేన శ్రేణులు కూడా సహకరించరు. మరి చూడాలి లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవుతుందో లేదో

Read more RELATED
Recommended to you

Latest news