స్ఫూర్తి: టీ షాపు పెట్టుకున్నారని అంతా వెక్కిరించారు.. కానీ ఇప్పుడంతా శభాష్ అంటున్నారు..!

-

లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎంత కష్ట పడినా కూడా కొందరు లైఫ్ లో సక్సెస్ అవ్వలేక పోతుంటారు మనం చిన్న పని చేసామా పెద్ద పని చేసామా అనేది ముఖ్యం కాదు లైఫ్ లో మనం అనుకున్నది సాధించామా లేదా అనేది చాలా ముఖ్యమైనది. ఈయన సక్సెస్ స్టోరీ ని చూస్తే ఇప్పుడు శభాష్ అంటారు.

2007లో ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నితిన్ సలూజ కొన్నాళ్ల తర్వాత ఓ టీ షాప్ ని మొదలుపెట్టాడు. ఇంత చదువుకున్నాడు టీ కొట్టు పెట్టాడేంటి అని అందరూ హేళన చేశారు ఉద్యోగం కంటే వ్యాపారవేత్త అవ్వాలని తాను అనుకున్నారు అందుకని ఎంత కష్టమైనా కూడా దీనిని మొదలుపెట్టారు. నితిన్ గుర్గావ్ లోని సైబర్ సిటీలో మొదటి కేఫ్ ని మొదలుపెట్టాడు 2022లో కంపెనీ 134.9 కోట్ల ఆదాయాన్ని పొందారు.

ఒపేరా సొల్యూషన్స్ లో పనిచేయడానికి యుఎస్ వెళ్ళాడు అప్పుడు టీ అమ్మాలనే ఆలోచన తనకి వచ్చింది. యుఎస్ లో ఏ ప్రదేశంలో కూడా ఒక కప్పు టీ ని రుచిగా తాగలేకపోయారని ఒక ఇంటర్వ్యూలో నితిన్ చెప్పుకొచ్చారు. మొదటిసారి కేఫ్ తెరవడానికి ఆ సంఘటనే కారణమని నితిన్ చెప్పుకొచ్చాడు. మొదటి కేఫ్ ని మొదలు పెట్టేందుకు రెండు సంవత్సరాల పాటు స్టార్ట్ అప్ ని ప్లాన్ చేశాడు ఇతని సంస్థ ఆదాయం వాల్యూషన్ దాదాపు 240 నుండి 250 మిలియన్ల డాలర్లు. ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news