పవన్ కళ్యాణ్ “బ్రో” మూవీ టీజర్ రిలీజ్…

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్నటి నుండి ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ బ్రో నుండి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు దర్శకుడిగా తమిళ నటుడు మరియు దర్శకుడు సముథ్రఖని వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఆల్రెడీ తమిళ్ లో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఈ రోజు కాసేపటి క్రితమే టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇంతకు ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాములుగా టీజర్ సాయంత్రం 5 .04 గంటలకు రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ కారణాల వలన ఇప్పుడు చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ టీజర్ 87 సెకనుల నిడివిని కలిగి ఉంది. ఈ టీజర్ లో ఆద్యంతం పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు తమదైన డైలాగ్ మరియు కామెడీ టైమింగ్ తో అలరించారు అని చెప్పాలి. ఇక ఇది పవన్ అభిమానులకు మంచి జోష్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news