మూవీ అప్డేట్: ధనుష్ “కెప్టెన్ మిల్లర్” ఫస్ట్ లుక్ రేపే…

-

తమిళ్ హీరో ధనుష్ తెలుగు లో తన నటన మరియు స్టైల్ తో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే ధనుష్ సినిమా ఏదైనా తమిళ్ లో విడుదల అయితే… తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. తాజాగా ధనుష్ నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. టాలెంట్ ఉన్న దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను ప్రకటించారు చిత్ర బృందం.. ఇప్పటి వరకు ధనుష్ పిక్స్… టైటిల్ పిక్స్ మాత్రమే ఈ సినిమా నుడి వచ్చాయి. కానీ రేపు సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇందులో ధనుష్ తో పాటుగా యంగ్ హీరో సందీప్ కిషన్ మరియు కన్నడలో సీనియర్ నటుడిగా పేరున్న శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి రేపు రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ ఎలా ఉండేఉందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news