జీవితంలో మనం అనుకున్నది సాధించాలన్నా టాప్ లో ఉండాలన్న అంత ఈజీ కాదు అందులోనూ ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికంటే మనం ప్రత్యేకంగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో బీటెక్ చదివే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బీటెక్ ఎక్కువ మంది చేయడంతో ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది.
కానీ రావూరి పూజిత మాత్రం 60 లక్షల ప్యాకేజీని ఇప్పుడు సొంతం చేసుకుంది. రావూరి పూజిత ఈ తరం వాళ్లకి స్ఫూర్తిదాయకం. యూట్యూబ్ ద్వారా ఈమె తన గోల్ ని రీచ్ అయ్యింది. ఇంతకీ పూజిత ఎలా సక్సెస్ అయ్యింది తన విజయ రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
కరోనా మహమ్మరి సమయంలో తన బీటెక్ మొదటి సంవత్సరంలో ఉంది లాక్ డౌన్ కూడా విధించారు దీనితో కళాశాలకే వెళ్లడం కుదరలేదు. కాలేజీలో చెప్పే ఆన్లైన్ పాఠాలు వినేది ఏమైనా డౌట్ వస్తే టీచర్స్ ని కానీ సీనియర్లను కానీ అడిగేది. ఒక్కొక్కసారి ఆన్లైన్లో కూడా ఈమె వినేది.
జేఈఈ లో ఝార్ఖండ్ బిట్స్ లో సీట్ వచ్చింది దూరంగా వెళ్లడం ఎందుకని తన తల్లిదండ్రులు పంపించలేదు. దానితో గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో ఈమె బీటెక్ జాయిన్ అయింది. కేఎల్ యూనివర్సిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్స్ ని స్టార్ట్ చేసారు. ఆ తరవాత ఈమె కోడింగ్ ని మొదలుపెట్టింది యూట్యూబ్ ద్వారా కోడింగ్ మీద పట్టు సాధించింది.
ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా సరే కోడింగ్ చాలా ముఖ్యం కోడింగ్ నుండే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి కనుక దాని మీద పట్టు సాధించింది. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని కోడింగ్ మరియు ఇతర ప్రాబ్లమ్స్ ని నేర్చుకుంది తర్వాత ఉద్యోగం సాధించడానికి ఇవే హెల్ప్ అయ్యాయి.
ఒకపక్క క్లాసులు వింటూ మిగిలిన సమయాన్ని ఈమె సొంతంగా ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యింది పూజిత. గూగుల్, అడోబ్, అమెజాన్ లో సెలెక్ట్ అయింది. ఆడోబ్ లో అమెజాన్ లో ప్యాకేజీ 45 లక్షల మాత్రమే ఉంది కానీ గూగుల్లో 60 లక్షల ప్యాకేజీ ఉండడంతో గూగుల్ లో జాయిన్ అయింది. ఉద్యోగంలో కాస్త పట్టు వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ ని తీసుకురావాలనేదే ఆమె లక్ష్యమని చెప్పింది. చాలామంది బీటెక్ పూర్తి చేసి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు పూజిత ని ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా అందరూ ఈమె లాగే సక్సెస్ అవ్వచ్చు.