ఈ ప్రపంచం స్వార్థపూరితమైనదని అందరూ అంటారు. నిజానికి ఎదుగుతున్నకొద్దీ స్వార్థంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో బాధ్యతలు, డబ్బు పట్ల వ్యామోహం.. అవతలి వారి జీవిత విధానం పట్ల మోహం వంటివేమీ ఉండవు.
ఎప్పుడైతే మనిషి జీవితంలోకి డబ్బు ప్రభావం ప్రవేశిస్తుందో అప్పుడే మనిషి మారిపోతాడు. చాలా దగ్గరివాళ్లే దూరమైపోతారు. అప్పటివరకూ ఎంతో మంచివాళ్ళు అనుకున్నవాళ్ళు చాలా నీచులుగా కనిపిస్తారు. ఇలాంటి షాక్ లు మొదటొసారి తగిలినపుడు మనిషి బాగా ఏడుస్తాడు. చివరికి మాత్రం మనుషులంతా ఇంతే అని తెలుసుకుంటాడు. అలా తెలుసుకోకపోతే నిత్యం ఏడుస్తూనే ఉంటాడు.
నువ్వు బాధపడకూడదని అనుకుంటే అవతలి వాళ్ల మీద ఎక్స్ పెక్టేషన్ పెట్టుకోకు. వాళ్ళు ఎవ్వరైనా సరే.. ఎక్స్ పెక్టేషన్ అస్సలు పెట్టుకోకు.
డబ్బు మీద దృష్టి పెట్టు. డబ్బుంటేనే మనిషి మనుగడ. దాన్ని సంపాదించడానికి పనిచెయ్యి. అలా అని డబ్బుకోసం కక్కుర్తి పడి చట్టవ్యతిరేకమైన పనుల జోలికి వెళ్ళకు. డబ్బు సంపాదించాలనే కోరిక బలంగా ఉండాలి, అలాగే డబ్బు మీద ఆశ తక్కువగా ఉండాలి. రెండూ ఒకేలా కనిపిస్తున్నా.. రెండూ వేరు వేరని మళ్ళీ మళ్లీ చదివితే అర్థమవుతుంది.
ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకుంటే జీవితంలో ఎదుగుతావు. ఎమోషన్స్ వలలో నువ్వు పడిపోయి.. అవి తిప్పినట్టుగా తిరిగితే ఎటూ కాకుండా పోతావు. అలాగే టైమ్ ని నీ చేతుల్లో ఉంచుకో.. అంటే.. ఏ టైమ్ కి ఏం చేయాలనుకుంటున్నావో అది చేయ్. అనవసరమైన పనులను మానేసెయ్. సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉండు. అలా అని అందులో ఏం జరుగుతుందో తెలుసుకోకూడదని కాదు. అందులో జరిగేది తెలుసుకుంటూనే వాడకాన్ని మితం చేయాలి.
ఫోకస్ పెంచుకో.. ఈ మధ్య సోషల్ మీడియా వల్ల అందరూ ఫోకస్ మిస్ అవుతున్నారు. నువ్వు కొద్దిగా ఫోకస్ చేస్తే విజయం నీదే.