ఉద్యోగం కోల్పోయారని కృంగిపోలేదు.. రాజ్మా చావల్ తో నెలకి అరవైవేలు సంపాదిస్తున్నారు ఈ జంట..!

-

సాధారణంగా మనం ఒక ఉద్యోగంని కోల్పోయాం అంటే ఎంతో బాధగా ఉంటాము. పైగా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానికి కూడా సమాధానం దొరకదు. తినడానికి తిండి, ఇతర ఖర్చులు వంటివి ఎలా పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. అయితే భార్య, భర్త ఇద్దరూ కూడా ఉద్యోగాన్ని కోల్పోయారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వాళ్ళు రాజ్మా చావల్ తో వారు ఇప్పుడు నెలకి 60 వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు. మరి ఇక ఈ జంట ఎలా కష్టపడుతున్నారు..? ఎలా వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే దాని గురించి చూద్దాం.

 

ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఢిల్లీలో ఒక ఆల్టో కార్ ని తీసుకుని వెళ్లి రాజ్మా చావల్ మొదలైన ఆహార పదార్థాలను అమ్ముతారు. స్టీల్ కంటైనర్లని వాళ్లతో పాటు తీసుకువెళ్తారు.

వేడి వేడి రాజ్మా చావల్, చోలే, బటర్ మిల్క్ వంటి వాటిని ఈ జంట అమ్ముతూ వుంటారు. రోజుకు కనీసం వంద మందికి పైగా వచ్చి ఇక్కడ తింటూ ఉంటారు. ఎంతో రుచికరంగా వీళ్ళు ఆహారాన్ని సప్లై చేస్తున్నారు. ప్రతిరోజు ఈ విధంగానే వ్యాపారం చేస్తారు. ఆదివారాలు మాత్రం సెలవు.

కరణ్ కుమార్ మరియు తన భార్య అమృత ఇలా ఈ విధంగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. గత కొన్నేళ్ల నుంచి కూడా కరణ్ ఎన్నో ఉద్యోగాలను చేయడం మొదలుపెట్టారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాన్ని కోల్పోవడంతో డబ్బులు కూడా లేవు. పైగా ఉండడానికి ఇల్లు కూడా లేకపోయింది. అప్పుడు అత్తమామలు తమ ఇంట్లో ఉండమని ఉద్యోగం పొందే వరకూ వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పారని కరణ్ చెప్పారు.

తన మామగారు కార్న్ ని తన కోసం కొని ఇచ్చారని చెప్పాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత చాలా రాత్రులు ఏడ్చానని కరణ్ భార్య అమృత చెప్పారు అయితే ఒకరోజు ఫుడ్ బిజినెస్ ని మొదలు పెట్టాలని మేము అనుకున్నాము.

వండడానికి చిన్న ఇల్లు ని కూడా రెంట్ కి తీసుకున్నాము అన్నారు. ఇలా ఫైనల్ గా వాళ్ళు రాజ్మా చావల్ తో నెలకి 30 వేలకు పైగా సంపాదిస్తున్నారు. వాళ్ళు అమ్మే ఆహార పదార్థాల ధరలు 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉంటాయి. ఇలా ఈ జంట ఈ ఫుడ్ బిజినెస్ తో మంచిగా లాభాలను పొందుతున్నారు. ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో కోల్పోయామని ఆ భాద లోనే ఉండిపోకూడదు. ఇంకా ఎంతో జీవితం ఉందని ముందుకు వెళ్ళండి.

Read more RELATED
Recommended to you

Latest news