గుర్తు తెలియని యుఆర్ ఎల్ నుంచి వచ్చే ఆక్సీమీటర్ యాప్స్ ను డౌన్లోడ్ చేయకుండా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్స్ వినియోగదారుల శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గుర్తిస్తాయని చెప్పినా సరే అవి మాత్రం ఒరిజినల్ కాదని అలాగే మన ఫోన్ నుండి ఫోటోలు తీయడం అదే విధంగా మన కాంటాక్ట్ లిస్టు ని బయటకు లాగడం వంటివి చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. వ్యక్తిగత డేటా కూడా పోయే అవకాశం ఉంది అని పేర్కొంది.
వినియోగదారుల బయోమెట్రిక్ సమాచారాన్ని కూడా దొంగిలించవచ్చని హెచ్చరించింది. యాప్ లో వారి బయోమెట్రిక్ వేలిముద్రల ద్వారా ఆక్సిమీటర్ యాప్స్ వినియోగదారుల రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిని చెక్ చేస్తాయి. అలాగే వారి హృదయ స్పందన కూడా ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఈ కామర్స్ సైట్స్ లో ఆక్సీమీటర్లు అందుబాటులో ఉన్నా కొంత మంది వీటిని డౌన్లోడ్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కచ్చితంగా ఉండే వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని ఈ నెల మొదట్లోనే కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అంటే వాటిని ఆపిల్ యొక్క యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే నేరుగా ఇన్‌స్టాల్ చేయమని పేర్కొంది. ఎస్ఎంఎస్, ఈ మెయిల్ లేదా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌ల ద్వారా వచ్చిన ఏ లింక్ ని అయినా సరే లైట్ తీసుకోవాలని హెచ్చరించింది. సోషల్ మీడియాలో యుపిఐ అనువర్తనాల ద్వారా డిస్కౌంట్ కూపన్లు, క్యాష్‌బ్యాక్ లేదా ఫెస్టివల్ కూపన్ లకు సంబంధించి ఏదైనా లాభదాయకమైన ప్రకటనలు వచ్చినా సరే దూరంగా ఉండాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాలో డబ్బు మాయం అవుతుందని హెచ్చరించింది.