నవంబర్ 1 నుంచి ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్..!

-

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుండి బీమాదారులకు KYC వివరాలను తప్పనిసరి చేయాలని అనుకుంటోంది. అయితే దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

బీమా కోసం క్లెయిమ్ చేసేటప్పుడు KYC పత్రాలను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలట. అయితే జీవిత బీమా కాకుండా ఇతర పాలసీని కొనుగోలు చేసినప్పుడు కూడా కెవైసి డీటెయిల్స్ ఉంటాయి. రూ. 1 లక్ష లేదా దాని కంటే ఎక్కువ బీమా క్లెయిమ్‌లకు అడ్రెస్ అవసరం. అలానే గుర్తింపు రుజువు వంటి KYC పత్రాలు కావాలి. కెవైసి డీటెయిల్స్ ని కూడా ఇప్పుడు తప్పనిసరి చేయాలని రెగ్యులేటర్ యోచిస్తోంది.

కెవైసి రూల్స్:

కెవైసి వలన బీమా సుగం పోర్టల్‌లో పాలసీ రికార్డు కోసం ఇది హెల్ప్ అవుతుంది. పోర్టల్‌లో, పాలసీదారులు ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోగలరు. అలానే పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ ని చూడచ్చు మరియు బీమా క్లెయిమ్‌లను సులభంగా చేయవచ్చు.
కెవైసి ప్రక్రియ కోసం ఫోటో గుర్తింపు, చిరునామా రుజువును ఇవ్వాలి.
ఈ మధ్యన ఏమైనా పాలసీ తీసుకుంటే.. మీరు బీమా సంస్థకు KYC పత్రాలను సబ్మిట్ చెయ్యాల్సి వుంది.
పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన జెరాక్స్ కాపీలు ఇవ్వాలి. టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కూడా అవసరం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version