తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సమితా ఇంద్రారెడ్డి… కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం హాజరు అయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ఇంటర్ రెండో సంవత్సరం 67.16 శాతం హాజరు అయ్యారన్నారు.
జేఈఈ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలు ఆలస్యం అయ్యాయని.. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు సబితా ఇంద్రారెడ్డి. పరీక్షలు బాగా పగఢ్భందిగా నిర్వహించామని.. ఆగస్ట్ 1 నుండి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు సబితా ఇంద్రారెడ్డి. క
రోనా తరవాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు స్వీకరిస్తాం. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.