తెలంగాణాకు ఇంటర్ విద్యార్ధి రెండు లక్షల విరాళం…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ఎవరికి వారుగా స్వయంగా ముందుకి వస్తున్నారు. ప్రభుత్వాలకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ అండగా ఉంటున్నారు. రైతులు సామాన్యులు ఇలా ప్రతీ ఒక్కరు కూడా ముందుకి వస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఇలా అందరూ కూడా ముందుకి వచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నారు.

తాజాగా తెలంగాణకు చెందిన ఒక విద్యార్ధి రెండు లక్షలకు పైగా ప్రభుత్వానికి సహాయం చేయడం విశేషం. ఇంటర్‌ విద్యార్థి ప్రణవ్‌ సాయి జాస్తి రూ.2.20 లక్షలు ప్రభుత్వానికి కరోనా పోరాటానికి విరాళంగా ఇవ్వడానికి ముందుకి వచ్చాడు. స్వయంగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించిన సాయి.. ఈ డబ్బును సేకరించాడు. బుధవారం మంత్రి కేటిఆర్ ని కుటుంబ సభ్యులతో కలిసాడు సాయి.

ఆయనకు స్వయంగా తన చేతులతో చెక్ ఇచ్చాడు. దీనిపై కేటిఆర్ హర్షం వ్యక్తం చేసారు. ఇలా స్వయంగా ముందుకి రావడం నిజంగా అభినందనీయమని… చిన్న వయసులోనే సాయం చేస్తున్నావు అంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రసంశించారు కేటిఆర్. సోషల్ మీడియాలో కూడా అతనికి ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ఇలా ముందుకి వచ్చి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరాడు.

Read more RELATED
Recommended to you

Latest news