శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో కీలకమైన విషయాలను చెప్పారు. ఆ విషయాలలో కొన్ని ఇప్పటికే జరగగా కొన్ని మాత్రం జరగాల్సి ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగి తీరుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించి సైతం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే హెచ్చరించారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాజులు ధర్మంతో పరిపాలించడం మాని విందులు, వినోదాల పట్ల ఆకర్షితులవుతారని పశువులు పాలు ఇవ్వకపోవడం వల్ల భయంకరమైన కరువు ప్రాప్తిస్తుందని పేర్కొన్నారు. వేర్వేరు మతాల ప్రజల మధ్య కలహాలు పెరిగి చివరకు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి కలుగుతుందని అన్నారు. పట్టణాలు, గ్రామాలలో అడవి మృగాలు ప్రవేశించి మనుషులను చంపుకొని తింటాయని తెలిపారు.
మన దేశాన్ని ఇతర దేశాల రాజులు పరిపాలిస్తారని… నీళ్లతో దీపాలను సైతం వెలిగించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. మనుషుల మధ్య బంధాలు క్షీణిస్తాయని తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి దూషించే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు. ఎంతో శాంతంగా ఉన్నవారు సైతం కోపాద్రిక్తులయ్యే పరిస్థితులు ఏర్పడతాయని… ప్రజలు, జంతువులు నెత్తురు కక్కి రోగాల పాలై చనిపోయే పరిస్థితి నెలకొంటుందని చెప్పారు.
మనిషికి డబ్బే ప్రధానం అవుతుందని… వేశ్యల దగ్గరకు వెళ్లేవారు భయంకరమైన రోగాల బారిన పడతారని… సత్ప్రవర్తన ఉన్నవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనపు చావును చూస్తారని అన్నారు.