రెండు పడవల మీద ప్రయాణం ఎంతోకాలం సాగదు అన్నది జగమెరిగిన సత్యం.. అలా చేస్తే తాను ఎంత మాత్రం ఊరుకోనని ఏపీ సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయం దగ్గుబాటి కుటుంబానికి తొందరగానే తెలిసివచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్వర్లు..ఆయన సతీమణి పురందేశ్వరి చెరో పార్టీలో కొనసాగుతూ ద్వంద రాజకీయాలకు తెరతీయడం జరిగింది. కుమారుడి భవిష్యత్ కోసమంటూ దగ్గుబాటి వెంకటేశ్వర్లు చాలా ఏళ్ల తర్వాత ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దిగారు. అయితే పురందేశ్వరీ మాత్ర బీజేపీలోనే కొనసాగడం గమనార్హం. కుమారుడి భారత పౌరసత్వం విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో పోటీ చేయాలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక అప్పటికే నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న దగ్గుబాటి వెంకటేశ్వర్లునే పోటీ చేయాల్సిందిగా స్వయంగా జగన్ కోరారు. అయితే భార్య బీజేపీలో ఉండటం..వెంకటేశ్వర్లు వైసీపీలో ఉండటం టీడీపీ అభ్యర్థికి లాభాచ్చిందనే చెప్పాలి. అవకాశా వాద రాజకీయాలకు దగ్గుబాటి కుటుంబీకులే నిదర్శనమని ప్రచారం చేయడంతో జనంలోకి ఆ మెసేజ్ బాగా వెళ్లింది. అక్కడ దగ్గుబాటి ఓడిపోయారు.
రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం కొనసాగగా…సీనియర్ నేతగా, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినా వెంకటేశ్వర్లు ఓడిపోవడాన్ని జగన్ ఏమాత్రం సహించలేదని సమాచారం. భార్యభర్తలు చెరో పార్టీలో ఉండటం వల్ల వైసీపీకి కూడా నష్టం వాటిల్లుతుందని భావించారట. దగ్గుబాటి దంపతులిద్దరూ అయితే వైసీపీలో లేదంటే బీజేపీలో ఉండాలని జగన్ అల్టీమేటం జారీ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవమెంతో అన్న సందేహాలకు జగన్ ఒంగోలులో జరిగిన పార్టీ కార్యక్రమం ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.
నాడు-నేడు కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జి హోదాలో వైసీపీ నేత రామనాథం బాబును జగన్ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. పర్చూరులో వైసీపీ పూర్తి బాధ్యతలను రామనాథంబాబుకు ఇచ్చిన జగన్ అక్కడ నేతలను సమన్వయం చేసుకోవాలని సూచించారట..దీంతో దగ్గుబాటికి జగన్ చెక్ చెప్పినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక దగ్గుబాటి సైతం అసలు నియోజకవర్గంలోకి రాకుండా హైదరాబాద్‌కే పరిమితం అయిపోయారు. ఇక రేపో మాపో ఆయన వైసీపీకి అధికారికంగా రాజీనామా చేయడం ఒక్కటే మిగిలి ఉంది.