టీమిండియా V/S బంగ్లాదేశ్‌: విజృంభిస్తున్న భారత బౌలర్లు..

-

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ భారత్ మధ్య చరిత్రాత్మక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభిసున్నారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్లు పెవిలియన్ క్యూ కడుతన్నారు. 21ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్లు నష్టపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా 15 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. బంగ్లా ఓపెనర్ ఇమ్రుల్ కయోస్ 15బంతులు ఆడి 4పరుగులు చేసి ఏడో ఓవర్‌లోనే టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు.

అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ మొమినుల్ హాక్ ఉమేష్ బౌలింగ్ లో పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. మిథున్ ను కూడా ఉమేష్ ఔట్ చేశాడు. రహీమ్‌కు మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని వికెట్లని ఆడుకుని క్లీన్ బౌల్డయ్యాడు. 13 ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇస్లామ్(29 బ్యాటింగ్ 52 బంతుల్లో 5×4) ఉమేశ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి పేకమేడలా వికెట్లు కోల్పోయింది. మహ్మదుల్లా 6 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో వృద్ధిమాన్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. లిప్టన్ దాస్ 24పరుగులు 27బంతుల్లో 5ఫోర్లు, నయిమ్ హసన్ క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news