గడిచిన రెండు రోజులుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఇక్కడ కరోనా కేసు లు అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, దీనికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన రెడ్డి చేసిన ర్యాలీనే కారణమని విపక్ష టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున దుయ్యబడుతున్నారు. ఇ క, వారికి అనుకూలంగా ఉన్న మీడియాలోనూ దీనిపై కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రా ష్ట్ర వ్యాప్తంగా శ్రీకాళహస్తిలో ఏంజరిగింది? ఇక్కడ పాజిటివ్ కేసులు పెరిగేందుకు ఎమ్మెల్యేనే కారణమా? అనే చర్చ సాగుతోంది. మరి ఇక్కడ అసలు ఏంజరిగిందో చూద్దాం..
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి ఓ వారం కిందట తన నియోజకవర్గంలో దాదాపు పది వే ల కిలోల బియ్యాన్ని పేదలకు పంచారు. అయితే, ఆయన వీటిని ప్రజలకు నేరుగానో.. లేదా ఇంటింటి కో వెళ్లి పంపిణీ చేయలేదు. తన నియోజకవర్గం కేంద్రం నుంచి ట్రాక్టర్లలో వివిధ మండలాలకు పంపించా రు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో సాయం చేసిన వారి కటౌట్లను ఏర్పాటు చే శారు. ఈ క్రమంలో పెద్దగా అనుచరులు లేకుండానే ఆయన ఆ ట్రాక్టర్లను పెరేడ్‌గా తీసుకు వెళ్లి.. ఆయా మండలాలకు సాగనంపారు.
నిజానికి ఈ పంపిణీ జరిగిన నాటికి కేసుల సంఖ్య 42(పాజిటివ్) తర్వాత కాలంలో ఈ కేసులు తాజాగా ఈ రోజుకు 73కు చేరాయి. ఇలా అనూహ్యంగా కేసులు పెరగడానికి మధునే కారణమనేది విపక్షాల వాదన. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితిని గమనిస్తే.. ఎమ్మెల్యే చేసిన ఈ పంపిణీ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని, లాక్‌డౌన్ నిబంధనలు కానీ, భౌతిక దూరం నిబంధనను కానీ ఉల్లంఘించి ఉంటే.. ఖచ్చితంగా ఈ కేసుల పెంపునకు ఆయనను బాధ్యుడిని చేయొచ్చు. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదుకదా? కేవలం మర్కజ్‌కు వెళ్లివచ్చినవారు,
లేదా విదేశాల నుంచి వచ్చినవారి వల్లే.. పాజిటివ్ కేసులు పెరిగాయని సాక్షాత్తూ కలెక్టరే తన వాయిస్ వినిపిస్తుంటే.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అసంబద్ధమైనవిగానే కనిపిస్తున్నాయి. తాము సాయం చేయక, చేసేవారిపై రాళ్లు రువ్వడాన్ని ప్రజలు కూడా హర్షించలేక పోతున్నారు. వలంటీర్ వ్యవస్థ ఉంది కదా.. వారితో సాయం చేయించొచ్చుకదా.. అంటే.. ప్రతిదీ వలంటీర్ వ్యవస్తే చూసుకోలేని సందర్భాల్లో ఎమ్మెల్యేలు బయటకు రావడం తప్పుకాదు కదా?! నిబంధనలు ఉల్లంఘించినట్టు కనిపిస్తే.. చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ, ఎక్కడా ఉల్లంఘనలు కనిపించడం లేదు. మరి ఎందుకు టీడీపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.