ఇంటర్నేషనల్ బికినీ డే: సమూద్రతీరాన ఆస్వాదించాలనుకుంటున్నారా? ఈ బీచులు మీకోసమే..

-

సముద్ర తీరం అనగానే చాలామందికి బికినీయే గుర్తుకు వస్తుంది. అలాంటి వాళ్ళు బికినీ డే గురించి తెలుసుకోవాల్సిందే. బికినీ రూపకర్త ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. ఫ్రెంచ్ డిజైనర్ లూయిస్ రియర్డ్, బికినీ తయారు చేసాడు. 1946రెండవ ప్రపంచ యుద్ధంలో స్వేఛ్ఛని కోరుకుంటూ బికినీ ట్రెండ్ అయ్యిందని నమ్ముతారు. బికినీ చరిత్ర గురించి పక్కన పెడితే, మహమ్మారి వల్ల సముద్రతీరాల్లో విహరించే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం కేసులు తగ్గాయి కాబట్టి, సరదాగా షికారు వెళ్ళాలను భావిస్తే భారతదేశంలోని బికినీలకు ఫేమస్ గా నిలిచే ఈ ప్రాంతాలను ఎంచుకోండి.

హనీబీచ్.. అంకోలా (కర్ణాటక)

మనుషులకి దూరంగా ప్రకృతిలో స్నేహం చేయాలనుకునే వారికి హనీ బీచ్ ని మించిన ప్రదేశం ఇంకోటి ఉండదనే చెప్పాలి. హన్నేబలిగా పిలవబడే ఈ బీచ్, గోకర్ణకి 29కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవైపు పూర్తిగా కొండ ఉంటే, మరో వైపు మొత్తం నీటితో సముద్రం, చూడడానికి చక్కగా ఉంటుంది.

జాలోర్ బీచ్.. వార్సా (గోవా)

దక్షిణ గోవాలో ఉన్న అత్యంత సుందర ప్రదేశం జాలోర్ బీచ్. ఇక్కడికి వచ్చే ప్రయాణీకులు సూర్యస్తమయాన్ని ఆస్వాదిస్తారు. చేతిలో మాక్ టెయిల్ పట్టుకుని మీకు కావాల్సిన వారితో కూర్చుని ప్రకృతి రమణీయ దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

మరారి బీచ్.. అలెప్పీ (కేరళ)

ఒకపక్క కొబ్బరి చెట్లు.. మరో పక్క సముద్రపు నీరు కలిసి రంగు రంగుల వర్ణంతో శోభాయామానంగా కనిపించడమే కాదు, తీరం పక్కన కేఫేలు, కేరళ సాంప్రదాయం ఉట్టిపడేలా రిసార్టులు అద్భుత అనుభవాన్ని అందిస్తాయి.

బలుదెరా బీచ్.. బరటాంగ్ (అండమాన్ నికోబార్ దీవులు)

బరాటంగ్ లో ఉన్న ఈ బీచ్, నీలాంబర్ జెట్టి నుండి 9కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వఛ్ఛంగా, స్పష్టంగా ఉండే సముద్రపు నీళ్ళు ఈత కొట్టాలనే ఉత్సాహాన్ని తీసుకువస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news