సౌత్‌లోనే స్టార్ హీరోగా ఎదిగిన తమిళ హీరో సూర్య (surya) రీసెంట్ గా కేంద్రం తెచ్చిన బిల్లుపై మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే సూర్య ఇలా మండిపడటం కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేక విషయాలపై బీజేపీ మీద మండిపడుతున్నారు. దాంతో అప్పటి నుంచే సూర్యకు బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మరోసారి అదే వాతావరణం కనిపిస్తోంది.
కేంద్రం తాజాగా సినిమాటోగ్రఫీ చట్టం 1952ను సవరించాలని డిసైడ్ చేసింది. అయితే ఈ బిల్లు భావ ప్రకటనా స్వేచ్ఛను దెబ్బ తీసేలా ఉందని సూర్య విమర్శించారు. కేంద్రం తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. దీంతో బిజేపీ నాయకులు సూర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ప్రెస్‌మీట్లు పెట్టి మరీ సూర్య కావాలనే ఆ బిల్లుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ బీజేపీ తమిళనాడు యువజన సంఘం ఆరోపణలు చేసింది. దీంతో అటు సూర్య అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం తీవ్ర స్థాయిలో ఉంది తమిళనాడులో. గతంలోకూడా నీట్ ఎగ్జామ్‌పై సూర్య కావాలనే తప్పుడు ప్రచారం చేశాడని, అందుకు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది బీజేపీ. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.