ఇజ్రాయెల్ డెడ్లీ ప్లాన్.. గాజా సొరంగాల్లో హమాస్‌ దళాల జలసమాధి

-

హమాస్​ను సమూలంగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఓవైపు వైమానిక దాడులు.. మరోవైపు భూతల దాడులతో హమాస్ మిలిటెంట్లకు ఊపిరి ఆడకుండా దాడులకు తెగబడుతోంది. ఇక ఇప్పుడు హమాస్ దళాలలను సమూలంగా నాశనం చేసేందుకు ఓ డెడ్లా ప్లాన్​ను అమలు చేస్తోంది. హమాస్ దళాలను గాజా సొరంగాల్లోనే జలసమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అమలు చేయడం షురూ చేసింది.

గాజా మెట్రోగా పిలిచే హమాస్‌ సొరంగాల్లోకి సముద్రపు నీటి విడుదల చేస్తోంది. ఈ ప్లాన్‌ తొలి దశలోనే ఉందని .. వీటిల్లో నీరు నింపే ప్రణాళిక పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఈ దెబ్బకు హమాస్‌ దళాలు నక్కిన ఛాంబర్లు, బందీలను దాచిన ప్రదేశాలు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమైపోతాయని.. కాకపోతే గాజాలోకి వచ్చి చేరే సముద్రపు నీరు కారణంగా ఇక్కడి మంచి నీటి వనరులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సొరంగాలను నీటితో నింపడం మంచి వ్యూహం అని ఐడీఎఫ్‌ చీఫ్‌ హెర్జీ హల్వీ తెలిపారు. ఇప్పటికే ఐదు భారీ పంపులను గాజా వద్దకు తరలించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news