అమెరికాలో 100 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహం

-

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌ నగర అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనియన్‌ (ఎస్‌ఓయూ)’ పేరుతో 100 అడుగుల హనుమాన్‌ విగ్రహం ప్రతిష్ఠించారు. ఆదివారం రోజున ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.

భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భారతీయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా చినజీయర్‌ స్వామి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం 100 అడుగుల ఆంజనేయ స్వామి మహా విగ్రహంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు. ‘జై వీర హనుమాన్‌’ నామ స్మరణతో ఆ ప్రాంగణం మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జై హనుమాన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news