ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ గురించే ప్రస్తుతం ఎక్కడ చూసినా వినబడుతోంది. ఏఐ వల్ల ఉపయోగం ఎంత ఉందో.. నష్టం కూడా అంతే ఉందని ఈ ఘటనను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఏఐ కారణంగా బాలుడు ఆత్మహత్య చేసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 9వతరగతి విద్యార్థి సెవెల్ సెట్జర్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని పాత్ర ఆధారంగా సెవెల్ డేనెరిస్ అనే చాట్ బాట్ తో మాట్లాడేవాడు.
ఆ చాట్ బాట్ పాత్ర సెవెల్ తో ప్రేమలో ఉన్నట్టు పేర్కొంది. ఇద్దరి మధ్య శృంగారం కి సంబంధించిన సంభాషణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే సెవెల్ ఫోన్ ను లాక్కున్నారు. దీంతో కొద్ది సేపటి తరువాత సవితి తండ్రి పిస్టల్ తో సెవెల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెవెల్ ఆత్మహత్య పై క్యారెక్టర్ ఏఐ తన బాధను వ్యక్తం చేసింది. ఈ ఘటన తరువాత కంపెనీ భద్రతా చర్యలను అమలు చేస్తూ.. మైనర్ వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్ ను తీసివేస్తానని వాగ్దానం చేసింది.