ప్రస్తుతం రోజు రోజుకు నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాటి మనిషిని మోసం చేయాలని కొందరూ పరితపిస్తుంటారు. ఎంత మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు మోసపోయినట్టే. అందుకే జాగ్రత్తగా ఉంటేనే ఈ సమాజంలో కాస్త బాగుంటుంది. ఎందుకంటే.. అజాగ్రత్తగా ఉంటే సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. తాజాగా బీమవరంకి చెందిన ఓ వ్యక్తికి ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ.. బెదిరించి రూ.73లక్షలను సైబర్ కేటుగాళ్లు నొక్కేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన రుద్రరాజు రంగప్రసాద్ కు డీసీఎల్ కొరియల్ కాల్ అంటూ ఫోన్ చేశారు. మీ పేరుమీదనే నాలుగు పాస్ పోర్టులు, నాలుగు ఏటీఎం కార్డులు, ఒక ల్యాప్ టాప్, డ్రగ్స్ వచ్చాయని కాల్ ద్వారా చెప్పారు. ఆ తరువాత ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ ఫోన్ చేసి కేటుగాళ్లు వివరాలను తీసుకున్నారు. రంగప్రసాదరాజు అకౌంట్స్ లోకి డబ్బు తమకు పంపితే పరిశీలించి తిరిగి వేసేస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ఈ విషయాన్ని నమ్మిన రంగప్రసాదరాజు తన మూడు బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.73లక్షల 20 వేలను బాధితుడు కేటుగాళ్ల అకౌంట్లో వేశాడు. వాళ్లు తిరిగి తన అకౌంట్ లో డబ్బులు వేయకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.