కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై BRS ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై వెంటనే అనర్హత వేటు వేయాలి అని ఆయన అన్నారు. మీ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభాపతి ప్రసాద్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న.
నేను ఛాలెంజ్ చేస్తున్న.. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేసి ఎన్నికలు పెట్టండి. ప్రజాక్షేత్రం లోకి వెలుదాం.. ప్రజలే న్యాయనిర్ణేతలు. మీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేఖ, రైతు వ్యతిరేక చర్యలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసులతో మీరు చేస్తున్న అరాచక పాలన, అరెస్టులు,ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులు అన్ని ప్రజలు గమనిస్తున్నారు.. ప్రజలు మీకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.