మెక్సికోలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే..?
మెక్సికోలోని రాష్ట్ర రాజధాని సియుడాడ్ విక్టోరియా సమీపంలోని హైవేపై ఓ ప్యాసింజర్ వ్యాను, మరో సరకు రవాణా ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 26 మంది మరణించినట్లు ఉత్తర సరిహద్దు తమౌలిపాస్ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. పరిమితికి మించి సరకు రవాణా చేయటం వల్ల ట్రక్కులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
సరకు రవాణా ట్రక్కును లాగుతున్న వాహనం ఘటన స్థలంలో లేదు. దీంతో డ్రైవర్ పరారయ్యి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.