500 కోట్లకు చేరిన సోషల్‌ మీడియా యాక్టివ్‌ యూజర్లు

-

ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా యూజర్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇంటర్నెట్ సేవలు సులభతరం కావడం దీనికి ప్రధాన కారణం. ప్రపంచ జనాభాలో 60 శాతానికి పైగా ప్రజలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ జనాభా ఇటీవలే 800 కోట్ల మార్కును దాటగా.. జులై నాటికి అందులో సోషల్‌ మీడియా వేదికల్లో దాదాపు 500 కోట్ల (4.88 బిలియన్‌ యూజర్‌ ఐడెంటిటీస్‌) మంది యాక్టివ్‌గా ఉన్నట్లు అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల వినియోగానికి సంబంధించి కెపియోస్‌ అనే డిజిటల్‌ అడ్వైజరీ సంస్థ తాజా గణాంకాలను వెల్లడించింది. ప్రతి సెకనుకు కొత్తగా చేరేవారి సంఖ్య సరాసరి 5.5గా ఉన్నట్లు చెప్పింది. ఇలా గడిచిన ఏడాదిలోనే కొత్తగా 17.3 కోట్ల మంది.. సోషల్‌ మీడియాలో చేరినట్లు అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 3.7శాతం పెరిగిందని వెల్లడించింది.  వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్, మెసెంజర్, టెలిగ్రామ్, వీ చాట్, టిక్ టాక్ డౌయిన్ యాప్ లను యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news