బంగ్లాదేశ్ కు 3 కోట్ల వ్యాక్సిన్ డోస్లు ఇస్తున్న ఇండియా

-

భారత్ తన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు 3 కోట్ల కరోనా వైరస్ మోతాదులను అందించడానికి ఒప్పందం చేసుకుంది. టీకా కోసం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. బ్రిటిష్ ఔషధ తయారీదారు ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సిన్… 3 కోట్ల మోతాదులను కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్ గురువారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.

కోవిడ్ -19 విపత్తుపై పోరాటంలో అన్ని దేశాలు ఏకం కావాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసిన తర్వాత ఈ ఒప్పందం జరిగింది. పొరుగు దేశాలకు సహాయం చేయడానికి మేము చురుకైన పాత్ర పోషించాలి అని ప్రధాని మోడీ అన్నారు. బంగ్లాదేశ్‌ తో తన సంబంధాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఈ ఒప్పందం కీలకం కానుంది అని బంగ్లాదేశ్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news