కోవిడ్ 19: ఆ 28దేశాలకు గేట్లు తెరిచిన అబుదాబి.. ఇండియాకి నో ఛాన్స్.

-

కరోనా మూలంగా అన్ని దేశాలు తమ తలుపులు మూసుకున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుండి తమ దేశానికి పర్యటకులను అనుమతించడం లేదు. అలాంటి నిబంధనలు అబుదాబి కూడా పెట్టింది. ఐతే తాజాగా ఈ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చేందుకు 28దేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరైతే అబుదానికి వస్తున్నారో వారంతా విమానాశ్రయంలోనే ఆర్ టీ పీసీఆర్ టెస్టుకి వెళ్ళాల్సి ఉంటుంది.

ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు వస్తే గనక, ఆరు రోజుల తర్వాత ఆర్ టీ పీసీఆర్ టెస్టు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే డోసు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు 12రోజుల తర్వాత ఆర్ టీ పీసీఆర్ టెస్టుకి వెళ్ళాలని నిర్ణయించారు. ఈ 28దేశాల్లో అమెరికా, చైనా, స్విట్జర్లాండ్ వంటివి ఉన్నాయి. అందులో ఇండియా సహా యునైటెడ్ కింగ్ డమ్ కి కూడా స్థానం రాలేదు. అంటే ఇండియా నుండి అబుదాబికి ఇప్పుడప్పుడే వెళ్ళే అవకాశం లేదన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news