మెక్సికో పార్లమెంట్లో ఏలియన్లు కలకలం సృష్టించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అయితే అవి నిజమైన ఏలియన్లు కాదట.. పార్లమెంటులో వేల ఏళ్ల ఏలియన్ల అవశేషాలు ప్రదర్శించారనే వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తిగా అవాస్తవమని మెక్సికోలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకురాలు జూలియాటా ఫియరో తేల్చారు. మానవులా? కాదా? అన్న విషయాన్ని నిర్ధరించడానికి ఎక్స్ కిరణాల కంటే అధునాతనమైన సాంకేతికత అవసరమని తెలిపారు. ఆ అవశేషాలను పెరూ నుంచి సేకరించగా.. కనీసం ఆ దేశ రాయబారిని ఆహ్వానించకపోవడం వింతగా ఉందని అన్నారు.
చట్టసభలో మంగళవారం రోజున జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఏలియన్ అవశేషాలను ప్రదర్శించారు. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను మెక్సికో పార్లమెంట్లో తెరిచి చూపించారు. వంకర తలతో, కుచించుకోపోయిన శరీరంతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రెండు గ్రహాంతర జీవుల శిలాజ అవశేషాలను వేల ఏళ్ల కిందట పెరూలోని కుస్కో నుంచి వెలికితీసినట్టు మౌసాన్ చెప్పారు. ఇవి మన భూగోళానికి చెందినవి కావని.. డయాటమ్ (ఆల్గే) గునుల్లో బయటపడిన శిలాజ అవశేషాలని తెలిపారు.
BREAKING: Alleged mummified alien corpses displayed at Mexico's Congress today, suspected to be 1,000 years old.
UFO enthusiasts celebrated a remarkable event today in Mexico City's Congress, led by journalist and ufologist Jaime Maussan. This official gathering unveiled two… pic.twitter.com/Mba2hDpQ0C
— KanekoaTheGreat (@KanekoaTheGreat) September 13, 2023