వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఫెడరల్ బ్యాంక్‌

-

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ షాక్ ఇచ్చింది. పెరుగుతున్న ధరలను స్థిరీకరించేందుకు మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. తాజాగా 25 బేసిస్‌ పాయింట్లు (0.25 శాతం) వడ్డీరేట్లు పెంచడంతో 16 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచడం గత 14 నెలల్లో ఇది పదోసారి.

పెంచిన ప్రకారం ప్రస్తుతం వడ్డీ రేట్లు 5 నుంచి 5.25 శాతానికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కీలక వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో హౌసింగ్‌, కీలక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే వడ్డీరేట్ల పెంపు ఇదే చివరిది కావచ్చని ఫెడ్‌ సంకేతాలు ఇచ్చింది.

ఇకపై అదనపు వడ్డీరేట్లు పెరగకపోవచ్చని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అన్నారు. ఇదొక ముఖ్యమైన మార్పుగా అభివర్ణించారు. ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరడంతో కట్టడి చేసేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ గతకొన్ని నెలలుగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news