చైనా కు అమెరికా హెచ్చరిక…! చైనా సముద్రం లోకి అమెరికా యుద్ధ నౌక..!

-

uss ronald reagan
uss ronald reagan

చైనా వ్యవహారం ఎలా ఉందంటే… అయితే తమ మాట వినాలి తమకు ఎదురు చెప్పొద్దు..! లేదా తమ బానిసత్వంలో బ్రతికేయాలి.. చైనా కి ప్రతికూలంగా ఎవరైనా తమ గలాన్ని వినిపించారంటే ఇక అంతే వారితో చైనా కు ఖయ్యం తప్పదు. ఇదే నేపద్యంలో భారత్ చైనా కు ప్రతికూలంగా తన గలాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్రం లో వినిపించింది ఇక అప్పటినుండి భారత్ ను కూడా తన ఆదినం లోకి తెచ్చేసుకోవాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కానీ చైనాకు తెలియనిది ఏంటంటే భారత్ లో చైనా పప్పులు ఉడకవు. భారత్ ఎన్నో దేశాలకు మిత్రదేశం భారత్ కు కష్టం రాకముందే వారు ఎదురించడానికి సిద్ధంగా ఉంటారు.

ఇక ఇలాంటి నేపద్యంలో అగ్రరాజ్యం అయిన అమెరికా ఇంటెలిజెన్స్ ద్వారా చైనా భారత్ పై మరి ఇతర దేశాలపై చేస్తున్న కవ్వింపు చర్యలను పసిగట్టి చైనా ను ఎదురించేందుకు సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో భారత్ కు మద్దత్తుగా నిలుస్తుంది, తాజాగా అమెరికా తన నావిక దళాలను కూడా దక్షిణ చైనా సముద్రం వైపు పంపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఇదే నేపద్యం లో అమెరికా తాజాగా తన న్యూక్లియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు యూఎస్‌ఎస్‌ నిమిజ్‌, యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌లను దక్షిణ చైనా సముద్రంలోకి విన్యాసాల నిమిత్తం పంపిస్తున్నది. తద్వారా ఈ సముద్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు హెచ్చరికలు పంపనుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు లుజోణ్‌ జలసంధిని చేరినట్లు సమాచారం. ఈ నెల 1 నుంచి చైనా నౌకాదళం దక్షిణ చైనా సముద్రంలో మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news