ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆచూకి గురించి ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నాయి. ఆయన ఉన్నాడా లేదా అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. కిమ్ కి కరోనా కంటే భయంకరమైన వ్యాధి వచ్చిందని ఆయన మరణించారు అని కొందరు అంటున్నారు. ఆయనకు కరోనా భయం పట్టుకుందని అనారోగ్యం తో ఉన్న తనకు అది మరింత ప్రమాదం అని భావించి దాక్కున్నారు అని అంటున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అమెరికా అధికారులు ఎవరూ కూడా కిమ్ జోంగ్ ఉన్ ని చూడలేదు అని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్‌పాంపియో తెలిపారు. అయితే కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాకపోతే తీవ్రం క్షామం ఉత్తరకొరియాను కాటువేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నెల 12 తరువాత కిమ్ ఇప్పటి వరకు కనపడలేదు. ఆయన తన తాత జయంతి వేడుకులకు కూడా కూడా హాజరు కాలేదు. కిమ్‌కు గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని కొన్ని మీడియా సంస్థలు ఆయన మరణించారు అని జపాన్ మీడియా ఏదోక వార్తను ఎప్పుడూ బయట పెడుతూనే ఉన్నాయి. కాని ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏ వార్త కూడా బయటకు పూర్తిగా రాలేదు.