రష్యాకు అమెరికా వార్నింగ్.. అణుదాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక

-

రష్యా అణుయుద్ధం మొదలుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా రష్యాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ధ్రువీకరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల సైనిక సమీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి పశ్చిమ దేశాల్లో అణుభయాలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌ యుద్ధ భూమిలో ఓటమి తప్పించుకోవడానికి రష్యా చిన్నసైజు టాక్టికల్‌  అణు బాంబును వాడొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ప్రైవేటుగా ఈ సందేశం రష్యాకు చేరింది.

United States of America flag and Russian Federation desk flags 3D illustration.

‘‘మేము రష్యన్లతో బహిరంగంగా ఎలా ఉంటామో.. ప్రైవేటుగా కూడా అలానే ఉంటాం. అణ్వాయుధాలపై అనవసరంగా మాట్లాడటం తగ్గించుకోవాలని సూచించాం. అణ్వాయుధం వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాస్కో తెలుసుకోవాలి. అణ్వాయుధం ప్రయోగించిన దేశం కూడా ఆ పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పాం’’ అని బ్లింకన్‌ పేర్కొన్నారు.

‘‘అమెరికా, మిత్రదేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి. మేము ఎలా స్పందించాలనే దానిపై స్పష్టమైన వ్యూహంతో ఉన్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులెవాన్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news