పాకిస్తాన్ పౌరులకు బలూచిస్తాన్ ఆర్మీ హెచ్చరిక

-

భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇది సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సొంత దేశం కావాలని పాకిస్తాన్ పై దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో స్వాతంత్య్ర పోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ  ఇందుకు తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి మరో కొత్త సవాళు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.

బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు పాకిస్తాన్ జెండాను తొలగించి, వాటి స్థానంలో బలూచిస్థాన్ జెండాలను ఎగురవేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితిలో ప్రస్తుత పరిస్థితులను బీఎల్ఏ తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది.  పాకిస్తాన్ ప్రజలు సైనికులకు సహకరించొద్దని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news