భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. దాడులు తక్షణమే తగ్గించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య చర్చలకు యూఎస్ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అవసరం అయితే భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలకు మధ్య వర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన రూబియో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మార్కో రూబియో స్పష్టం చేసారు.
మరోవైపు గురువారం రాత్రి భారత్ పై దాడులు చేసేందుకు వచ్చిన పాక్ ఫైటర్ జెట్లను భారత బలగాలు కూల్చివేశాయి. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చివేసింది. పాక్ పైలట్ ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసం పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు.