బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ఆలయం కూల్చివేత… ఇస్లామిక్ మూక దుశ్చర్య

-

బంగ్లాదేశ్ లో కొంత మందితో కూడిన ముస్లిం మూక దుశ్చర్చకు పాల్పడింది. ఢాకా డివిజన్‌లోని వారిలోని లాల్మోహన్ సాహా స్ట్రీట్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయంపై ఉన్మాద ముస్లిం గుంపు గురువారం రాత్రి దాడి చేసింది. ఈ దాడిపై బంగ్లాదేశ్ లోని హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి 62 ఏళ్ల హాజీ షఫివుల్లా నేత్రుత్వం వహించగా.. సమారు 150-200 మందితో కూడిన ఇస్లామిక్ మూక ఇస్కాన్ దేవాలయాన్ని ముట్టడించి దాడికి పాల్పడింది. ఆలయంలోని విగ్రహాన్ని అపవిత్రం చేయడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసింది. డబ్బు, ఇతర విలువైన వస్తువును దోచుకున్నారు. 

దాడిలో ముగ్గురు భక్తులు సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహార్ హల్దార్ మరియు రాజీవ్ భద్ర గాయపడ్డారు. దాడికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను వాయిస్ ఆఫ్ బంగ్లాదేవీ హిందు ట్విట్టర్ లో షేర్ చేసింది.  గతంలో కూడా బంగ్లాదేశ్ లో ఇలాంటి ఘటనలే జరిగాయి. గతేడాది అక్టోబర్ లో ఇదే విధంగా కొంతమంది నోఖాలీ ప్రాంతంలో ఇస్కాన్ దేవాలయాన్ని తగబెట్టారు. మైనారిటీ హిందువులను గాయపరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news