జగనన్న..కేసీఆర్ ఫార్ములా ఏపీలో వర్కౌట్ అవుతుందా!

-

అవును ఇప్పుడు ఏపీలో జగన్..గతంలో తెలంగాణలో కేసీఆర్ వాడిన ఫార్ములాని వాడుతున్నట్లే కనిపిస్తోంది..అదే ఫార్ములాతో రెండోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. అసలు కేసీఆర్ వాడిన ఫార్ములా ఏంటి? జగన్ ఎందుకు అదే ఫార్ములాని వాడాలని అనుకుంటున్నారు? అనే విషయాలని చూసే ముందు ఒకసారి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురించి మాట్లాడుకోవాలి. 2014లో గెలిచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్…ఇంకా సమయం ఉండగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓ వైపు ఉండగా, కాంగ్రెస్-టీడీపీ-సి‌పి‌ఐ-సి‌పి‌ఎం-టీజేఎస్…ఇంకా చిన్నాచితక పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి.

ఇలా ప్రతిపక్షాలు ఏకం అవ్వడంతో కేసీఆర్‌కు చెక్ పడుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కేసీఆర్…సెంటిమెంట్ లేపారు…తనని ఓడించడానికి అందరూ కలిశారని, తాను ఒంటరిగానే పోరాడుతాను అన్నట్లు రాజకీయం చేశారు…ఇక ప్రజలు కూడా కేసీఆర్‌ని ఒక్కడిని చేసి…మిగతా వారు కొట్లాడుతున్నారని చెప్పి, కేసీఆర్ వైపుకు మొగ్గు చూపారు. దీంతో మళ్ళీ టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చేసింది.

ఇప్పుడు అదే ఫార్ములాని ఏపీలో వర్కౌట్ చేయాలని జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. ఎలాగో టీడీపీ-జనసేన పొత్తు సెట్ అవుతున్న విషయం తెలిసిందే..ఈ రెండు పార్టీలతో బీజేపీ లేదా కమ్యూనిస్టులు కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే వైసీపీ ప్రత్యర్ధులంతా ఏకం కానున్నారు. అయితే ఎంతమంది ఏకమైన జగన్‌ని ఓడించలేరని వైసీపీ నేతలు చెబుతున్నారు…జగన్ మగాడు అని ఒక్కడే ఫైట్ చేస్తారని డప్పు కొట్టేస్తున్నారు..జగన్ కావాలని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని చెప్పి వైసీపీ నేతలు సెంటిమెంట్ లేపుతున్నారు.

అంటే వైసీపీ ఉద్దేశం ఏంటంటే…అయ్యో జగన్ ఒక్కరే అయిపోయారే….మిగతా వారంతా ఏకమైపోయారే..అయ్యో పాపం జగన్ అని జనాలు ఫీల్ అవ్వాలని వైసీపీ భావిస్తుంది. అంటే సెంటిమెంట్ లేపి రెండోసారి అధికారంలోకి రావాలని…అయితే తెలంగాణ ఫార్ములా ఏపీలో వర్కౌట్ అవ్వడం ఈజీ కాదు…ఎందుకంటే ఇక్కడ వైసీపీపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. చూడాలి మరి చివరికి ఏం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news