ఆమె గెలుపు ముందు…ఈమె ప్రయత్నం ఫలించలేదా?

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు దేశాలకు అద్యక్షులై పరిపాలన చేస్తున్నారు. వీరి ధైర్యం ముందు కరోనా ఆటలు సాగలేదంటే నమ్ముతారా! నిజమండీ. మహిళలు అధ్యక్షులుగా ఉన్న దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంది.సవాళ్లను స్వీకరించి పరిస్థితి చక్కదిద్దుతున్నారు.

jo jorgensen
jo jorgensen

అమెరికాలో నడుస్తున్న ద్విపార్టీ తీరును వ్యతిరేకించే, నిరసించే సమూహంలోని వ్యక్తి జోర్గెన్‌సన్‌. లిబర్టేరియన్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి మహిళ ఈమె. కమలా హారిస్ గెలుపు ముందు ఈమె ప్రయత్నం గుర్తించలేకపోవచ్చు… విజయం సాధించకపోవచ్చు కాని రిపబ్లికన్లకు వ్యతిరేకంగా పోటీ చేసిన తొలి మహిళ ఈమె. రిపబ్లికన్స్‌ ఖాతాలో పడాల్సిన జార్జియా రాష్ట్రం బైడెన్‌ వశం కావడానికి కారణం జోర్గెన్‌సనే. అవును  ఆమె వల్లే ట్రంప్‌ ఓట్లు చీలాయి. ఈ ఎన్నికల్లో జోర్గెన్‌సన్‌కు పదహారు లక్షల ఓట్లు పడ్డాయి.

తను అధ్యక్షపదవిలోకి వస్తే అమెరికాను నిరాయుధ దేశంగా మలుస్తానని, ప్రపంచ దేశాల వ్యవహారాల్లో తలదూర్చకుండా … హింసను ప్రేరేపించకుండా, తటస్థంగా ఉండేలా చూస్తానని చెప్పింది జోర్గెన్‌సన్‌. తను ఎన్నికైన మరుక్షణమే ప్రపంచ దేశాల్లోని  అమెరికా మిలటరీ ఆపరేషన్స్‌ను నిలిపేసి.. ఆ సైన్యాన్ని స్వదేశానికి రప్పిస్తానని,  విదేశాలకు అందించే ఫండ్‌ను ఆపేస్తానని చెప్పింది. అమెరికాను సర్వశక్తి దేశంగా తీర్చిదిద్దుతామని, క్రిమినల్‌ జస్టిస్‌లో మార్పు తీసుకొస్తామనీ మాట్చింది.

ఈ ఉపన్యాసానికి ప్రజలు ఆకర్షితులయ్యారు. అందరికి ఆమె తలపెట్టిన అమెరికా పునర్నిర్మాణపు ఆలోచనలు నచ్చాయి. ప్రరంచ దేశాలు ఈమె నిర్ణయాలకు సొంతషపడ్డాయి..తమ దేశంపైకి పోరుకు రాకుండా వాళ్లతిప్పలేవో వాళ్లు పడతామంటే అంతకు మించింది ఇంకేముంది.ఎలాగో మహిళే పద్ద సమస్య ఉండదు అనుకున్నాయి. 23దేశాల్లో స్త్రీ శక్తే అధికారంలో ఉందని అక్కడ పాలన బాగుందని ఆమె గుర్తుచేసింది.

జోర్గెన్‌సన్‌ సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. జోర్గెన్‌సన్‌లో వ్యాపార దక్షతా మెండే. 1980లో ఏంబీఏ చదివింది. ఐబీఎంలో మార్కెటింగ్‌ రిప్రజెంటేటివ్‌గా చేరింది. పెళ్లి, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే తన కెరీర్‌కూ బ్రేక్‌ పడకుండా చూసుకుంది. ఈమె గెలవక పోవచ్చు..కానీ ధైర్యంగా అధ్యక్ష పోరులో నిలబడింది.