కరోనా మందు మేము కనుక్కుంటాం… బిల్ గేట్స్ కీలక ప్రకటన…!

-

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ కీలక అడుగు వేయడానికి సిద్దమయ్యారు. కరోనా వైరస్ కి మందు కనుక్కోవడానికి గానూ తాము ప్రయత్నాలు మొదలుపెడుతున్నామని అన్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తాము కరోనా వైరస్ కి ఏడాదిలో మందు కనుక్కునే ప్రయత్నాలు మొదలు పెడతాం అని… అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆయన వ్యాఖ్యలు చేసారు.

దాదాపు రెండేళ్ళ లోపు దీనికి మందు కనుక్కోవడానికి సమయం పట్టవచ్చు అన్నారు ఆయన. కొందరు చెప్పినట్లుగా, టీకా ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా తయారు కావడానికి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ మరియు వైట్ హౌస్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌసీని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు.

18 నెలల సమయం పడుతుందని తాము అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. అమెరికాలో ఎక్కువగా పరిక్షలు నిర్వహిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాటలపై గేట్స్ పెదవి విరిచారు. తప్పుడు వ్యక్తులకు పరిక్షలు నిర్వహించారని ఆయన అన్నారు. 24 గంటల లోపు పరిక్షా ఫలితాలు రాకపోయినా సరే ఫలితం ఉండదు అని, అసలు ఆ పరిక్షలకు విలువ ఉండదు అని గేట్స్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికాలో 60 లక్షల మందికి కరోనా పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news